జగిత్యాల రూరల్, నవంబర్ 26: నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో బీజీగా ఉండే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శనివారం తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. స్వయంగా 30 మంది నిరుపేదలకు ఉచిత నేత్ర శస్త్రచికిత్సలు చేశారు. జగిత్యాలలోని పావనీ కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో కంటి ఆపరేషన్లు చేశారు. అనంతరం వారికి కండ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సురేశ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ సుధాకర్‌రావు, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, వంశీ, సీఐ కృష్ణ కుమార్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.