సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. కంచెరబావి, ఆవుల బావి వద్ద ఆడబిడ్డలు గంటలకొద్దీ నిలబడి బిందెడు నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేది. ఎడ్లబండ్ల్ల మీద డ్రమ్ములు పెట్టుకొని తెచ్చుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో నీటి గోస తీరింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృషి మేరకు 35 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టగా, ఏరియాల వారీగా ట్రయల్ రన్ నడుస్తున్నది. ఇప్పటికే పలు కాలనీలకు నీటి సరఫరా జరుగుతుండగా, త్వరలోనే పట్టణమంతా అందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
Mission Bhagiratha | పెద్దపల్లి, ఏప్రిల్ 28 : సమైక్య పాలనలో పెద్దపల్లి ప్రజానీకం తాగునీటికి తండ్లాడింది. కనీసం మంచినీళ్లయినా ఇవ్వాలనే సోయి అప్పటి ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు లేదు. స్వరాష్ట్రంలో పెద్దపల్లిలో తాగునీటి సమస్యలు నెమ్మదిగా పరిష్కారమయ్యాయి. 2014లో పెద్దపల్లి నగర పం చాయతీ ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తుల బావులను లీజుకు తీసుకోవడం, చెరువుల సమీపంలో నూతనంగా బావులు తవ్వడం, వాటర్ ట్యాంకర్ ట్రాక్ట ర్ల ద్వారా వాడవాడలా మంచినీరు అందించేందుకు అధికారులు భగీరథ ప్రయత్నమే చేశారు. దాని కోసం ఏడాదికి 10 లక్షల దాకా ఖర్చు పె ట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ, స్వరాష్ట్రంలో పరిష్కారం దొరికింది. ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఏండ్ల నాటి గోస తీరింది. ఇం దుకు పెద్దపల్లి ఎమ్మెల్యే ఆది నుంచి ప్రత్యేక కృషి చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుం చి హైదరాబాద్‌కు వెళ్లే పైపు లైన్‌కు లింక్ కలిపి పెద్దపల్లి ప్రజ ల దాహం తీర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించగా, సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు పెద్దపల్లి మండలం అప్పన్నపేట చెరువును నింపి, అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వా రా బొంపెల్లి గుట్టపై ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి మళ్లీ పైప్‌లైన్ ద్వారా ట్యాంకులకు ఎక్కించి పెద్దపల్లి పట్టణానికి సరఫరా చేశారు. దీంతోపాటు బొం పెల్లి వద్ద ఏర్పాటు చేసిన గ్రిడ్ నుంచీ కూడా నీటిని ట్యాంకులకు విడుల చేస్తున్నారు.
ఇంటింటికీ శుద్ధజలం
మిషన్ భగరథ పథకం ద్వారా పెద్దపల్లి పట్టణంలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరందించేందుకు 35 కోట్ల అంచనా వ్యయంతో 107 కిలోమీటర్ల మేర పైపు లైన్ పనులు, వాటర్ ట్యాం కుల నిర్మాణ పనులు చేపట్టారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 2100 కేఎల్ సామ ర్థ్యం వాటర్ ట్యాంక్, 1200 కేఎల్ కెపాసిటీ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు, పైపు లైన్ ప నులు పూర్తి చేశారు. పట్టణంలో 8వేల నల్లా కనెక్షన్ ఇచ్చారు. ట్రయల్ రన్ కొనసాగుతుండ గా, సక్సెస్ అయిన ఏరియాలకు నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. ప్రస్తు తం వ్యవసాయ మార్కెట్, టీచర్ కాలనీ, శాంతినగర్, గణేశ్‌నగర్, కునారం రోడ్, చీకురాయి రోడ్ ఏరియా ల్లో ఇం టింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. త్వరలో పెద్దపల్లిలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ఆరు జోన్లుగా విభజించి నీటి సరఫరా
పెద్దపల్లి పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా నిర్మించిన 2100 కేఎల్, 1200 కేఎల్ సామర్థ్యమున్న వాటర్ ట్యాంక్‌లతోపాటు శివపురి కాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ, ఆర్డీవో కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయంలోని వాటర్ ట్యాంక్‌లు ద్వారా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు.
ఇంటింటీకీ సురక్షిత తాగునీరు
సీఎం కేసీఆర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో పెద్దపల్లిలో తాగు నీటి సమస్యను పరిష్కరించాం. 35 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి. పెద్దపల్లి పట్టణంలో 8వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిషన్ భగరథ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమై న నీరందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతున్నది. ట్రయల్ రన్లో చిన్న చిన్న లీకేజీలు గుర్తించి మరమ్మతు చేసి నీటి సరఫరా చేయాలని అధికారులకు సూచిం చాం. త్వరలోనే పెద్దపల్లి ప్రజల తాగునీటి సమస్య తీరుతుంది.
– డా. దాసరి మమతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ (పెద్దపల్లి)
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు
2014కు ముందు పెద్దపల్లిలో తాగునీటి సమస్య తీ వ్రం గా ఉండేది. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాగునీటి సమస్యకు శాశ్వాత పరిష్కారం చూపాలనుకున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశా. పెద్దపల్లి ప్రజల తిప్పలను వివరించా. సీఎం మా విజ్ఞప్తి మేరకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పైపు లైన్‌కు చిన్న లింక్ ఏర్పాటు చేయించారు. దాంతో అప్పన్నపేట చెరువును నింపి, అక్కడి నుంచి బొంపెల్లి గుట్ట మీద ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రానికి త రలించాం. తర్వాత అక్కడి నుంచి పెద్దపల్లి పట్టణానికి తాగునీరందించాం. 35 కో ట్లతో మిషన్ భగరథ పథకం కింద 35 కోట్ల ఖర్చు చేసి ఇంటింటికీ శుద్ధజలం అం దేలా ఏర్పాట్లు చేశాం. ఇటీవల ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది. పెద్దపల్లి పట్టణానికి ప్రతి రోజూ మిషన్ భగీరథ ద్వారా 7.5 ఎంఎల్డీ వాటర్ సరఫరా అవుతున్నది.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే