Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 3 : కరీంనగర్ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన చేపట్టిన ఎన్యూమరేటర్లకు పారితోషకం పంపిణీలో కనబరుస్తున్న నిర్లక్ష్యంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. సీపెక్ సర్వే చేపట్టి పదిహేను నెలలు దాటినా, వారికందించాల్సిన రెమ్యూనరేషన్ ఇప్పటికీ అందకపోవటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లిచ్చినా.. ఖాతాల్లో జమచేయటం లేదని, బడ్జెట్ విడుదల చేసినా అమోదముద్ర వేయకుండా చోద్యం చూస్తుండటం పట్ల మండిపడుతున్నారు.
ఇప్పటికే ఓసారి నిధులు మురిగిపోగా, జిల్లాలో సర్వే చేపట్టిన గణకుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాల జాబితాలు రెండోసారి కోశాగార శాఖకు పంపారు. అయినా, వారికి చెల్లించాల్సిన డబ్బులు జమచేయలేదు. ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళరుగుతున్నా, కనీస స్పందన లేదని వాపోతున్నారు. ప్రజావాణి లో సైతం ఆర్జీలు అందజేసైనా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో మరోసారి నిధులు వెనక్కివెళ్ళే అవకాశాలున్నాయని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మొత్తంగా 5,250 మంది గణకులుగా పాల్గొన్నారు. వీరికి ప్రభుత్వం ప్రకటించిన మేరకు రూ.3,94,68,000 చెల్లించాల్సి ఉంది. అయితే, సర్వే ఖర్చులతో పాటు పారితోషకం కూడా వెంటనే చెల్లించేందుకు ముందుగానే నిధులు విడుదల చేసినా, వాటిని ఇతర అవసరాల కోసం మళ్ళించటంతో వారి ఖాతాల్లో జమచేయటం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి పారితోషకం ఇప్పించాలని వేడుకోగా, తాజాగా మరోసారి కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నట్లు విధుల్లో పాల్గొన్న సిబ్బంది వెల్లడించారు.
జిల్లాలో 2024 నవంబర్ 9న మొదలైన సీపెక్ సర్వే 40 రోజులకు పైగా కొనసాగింది. ఇంటింటి సర్వే కోసం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయితీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న 2,742 మంది ఎన్యూమరేటర్ మళ్ళించటంతో వారి ఖాతాల్లో జమచేయటం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వారితోషకం ఇప్పించాలని వేడుకోగా, తాజాగా మరోసారి కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నట్లు విధుల్లో పాల్గొన్న సిబ్బంది వెల్లడించారు. జిల్లాలో 2024 నవంబర్ 9న మొదలైన సీవెక్ సర్వే 40 రోజులకు పైగా కొనసాగింది. ఇంటింటి సర్వే కోసం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయితీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న 2,742 మంది ఎన్యూమరేటర్ విధులు నిర్వహించారు.
తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇతర శాఖలకు చెందిన హెచ్‌వోడిలు 252 మంది సూపర్వైజర్లుగా, సర్వే పూర్తైన అనంతరం ఆన్లైన్లో నమోదు చేసేందుకు 2,256 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహించారు. ఎన్యూమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో నమోదు పత్రానికి రూ.25 చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. దీని ప్రకారం ఎన్యూమరేటర్లకు రూ.2,74,20,000, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.30,24,000, సూపర్వైజర్లకు రూ.30,24,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంది ఇందుకోసం సర్వేలో పాల్గొన్న వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరించి, సంబంధితాధికారులకు అందజేశారు. చెల్లింపులపై రాష్ట్ర స్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయాలతో మొదటిసారి నిలిచిపోగా, ట్రెజరీలో జమచేసినా టోకెన్లు విడుదల చేయక రెండోసారి పెండింగ్ ఉన్నట్లు సర్వే సిబ్బంది పేర్కొంటున్నారు.
పలుమార్లు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయటంతో ఇటీవలే నిధులు విడుదల కాగా, టోకెన్లు కూడా జారీ చేశారు. అయితే, సంబంధిత ఫైలుపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేయకపోవటంతో ఆన్లైన్లో వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని చూపుతున్నట్లు వాపోతున్నారు. దీంతో, ఈ ఆర్థికంలో కూడా నిధులు వెనక్కువెళ్ళటం ఖాయమనే చర్చ వారిలో కొనసాగుతున్నది.
జిల్లాలోని 16 మండలాలు, మూడు మున్సిపాల్టీలు, ఒక కార్పోరేషన్‌కు సంబంధించిన 20 బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు స్పష్టమవుతుండగా, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దేనికి సంకేతమనే ప్రశ్నలు వారి నుంచి ఉద్భవిస్తున్నాయి వాస్తవానికి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అత్యధిక మంది చిరుద్యోగులు మాత్రమే సర్వే విధుల్లో పాలుపంచుకున్నారు. తాము చేస్తున్న ఉద్యోగాల ద్వారా వచ్చే వేతనానికి ఈ పారితోషకం వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్లుగా ఉంటుందనే భావనతో తమ జేబుల్లో నుంచి ఖర్చులు పెట్టుకుని సర్వే చేస్తే, ఏడాది దాటినా విడుదల చేయకపోవటం ఏమేరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే టోకెన్లు అప్రూవల్ చేసి, తమకు రావాల్సిన మొత్తం తమ ఖాతాల్లో జమచేయాలని కోరుతున్నారు.