Sultanabad | సుల్తానాబాద్ రూరల్ నవంబర్10: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ వినుపల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని దేవునిపల్లి, కొదురుపాక , నారాయణపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, సీఈవో రమేష్, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, హమాలీలు, సంఘ సిబ్బంది తోపాటు తదితరులు పాల్గొన్నారు.