Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువారం గోదావరిఖని గాంధీ నగర్ లోని ఎండిహెచ్ డబ్ల్యుఎస్ బాలల సంరక్షణ కేంద్రం సందర్శించారు.
వృత్తి రీత్యా గోదావరిఖనిలో ఉన్న సమయంలో 2017 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులకు కూతురు మయూఖ దురదృష్టవశాత్తు మృతి చెందారు. అప్పటినుంచి తమ కూతురి మరణం నుంచి బయటకు రాలేక ప్రతీ సంవత్సరం కుమార్తె వర్ధంతి సందర్భంగా పదిమంది అనాథ పిల్లలకు అన్నదానం చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో వృత్తిపరంగా జగిత్యాల జిల్లాకు బదిలీ అయినప్పటికీ మర్చిపోకుండా గురువారం ఆ దంపతులు కూతురు మయూఖ వర్ధంతి సందర్భంగా గోదావరిఖనికి పట్టణానికి వచ్చి ఆశ్రమంలోని అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గంగవరం సతీష్ రాజేశ్వరి దంపతులు మాట్లాడుతూ తమ కూతురిని తమ నుంచి భౌతికంగా దూరం అయినా కూడా ఆమె జ్ఞాపకార్థం ఇలా ప్రతీ ఏటా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు అన్నదానం వారిలో తమ కూతురిని చూసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆశ్రమం కు మునుమందు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కాసిపేట బాబు, కొత్తకొండ రాజు, జిదుల సారంగపాణి, ఆశ్రమ వ్యవస్థాపకులు, పెద్దపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య, ఆశ్రమంలోని పిల్లలు పాల్గొన్నారు.