Karimnagar | ముకరంపుర, జులై 6 : ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్)వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందు నిలుస్తోంది. కరీంనగర్ లోని రామడుగు మండలం వెలిచాల లోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమానికి సోమవారం రూ.20 వేల మొత్తాన్ని చెక్కు రూపంలో ఆశ్రమం నిర్వాహకులకు ఎన్పీడీ సీఎల్ సీఈ(హెచ్ ఆర్డీ) మాధవరావు, కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ ఆర్ రవీందర్ అందజేశారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ చురుకుగా పాల్గొంటున్నదని సీఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈలు, ఎస్ఏవో, ఉద్యోగులు పాల్గొన్నారు.