Donation | కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 17 : శాతవాహన విశ్వవిద్యాలయం లోని బీ ఫార్మసీ కోర్సునకు రాబోయే విద్యాసంవత్సరం నుండి బంగారు పతకం కోసం రూ. 2 లక్షల చెక్కును విశ్వవిద్యాలయ ఇంజనీర్ తుల ప్రకాష్ రావు తన తల్లి తుల అనసూయ స్మారకంగా బంగారు పతాకాన్ని విరాళంగా ఉపకులపతి ఆచార్య యూ ఉమేష్ కుమార్ కు అందజేశారు. విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీతో బంగారు పథకాన్ని కోర్సులో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థికి అందజేస్తామని తెలిపారు.
ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ప్రతిభకు పట్టం కట్టడానికి బంగారు పథకాలను బహుకరించడానికి ముందుకు రావటం ఎంతో అభినందించదగ్గ విషయమని దాతలు ఎవరైనా తమకు నచ్చిన కోర్సులలో ఎవరి పేరు మీదైనా బంగారు పథకాన్ని విరాళంగా ఇవ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పీ సతీష్ కుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీశైలం, ఫార్మసీ విభాగాధిపతి డాక్టర్ పీ క్రాంతిరాజు, సహాయ రిజిస్ట్రార్ వై కిషోర్ తదితరులు పాల్గొన్నారు.