Karimnagar Collector Chitra Mishra | కలెక్టరేట్, జులై 6 : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 169 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 67, కరీంనగర్ నగరపాలికకు 54 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.