మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 1: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఓట్ల కోసం బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు కులాలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లి పట్టణంతోపాటు మండలం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 106 మం ది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అడిగితే తగిన బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు సంక్షేమ పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు తీసుకున్నారని, అయినా నేటికీ పథకాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎవరికీ డబ్బులు ఇవ్వొదన్దిని, అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో ఏమైనా సమస్యలుంటే నేరుగా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కుల రాజకీయాలు చేసే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బంగారు కాళ్ల కిషోర్, చంద్రశేఖర్‌రావు, నాయకులు పుల్ల జగన్‌గౌడ్, ఓజ్జెల శ్రీనివాస్, గడ్డం రాంరెడ్డి, గడ్డం రాజారెడ్డి, చెప్పాల రాజం, తదితరులు పాల్గొన్నారు.