Chigurumamidi | చిగురుమామిడి, మే 29 : పంట అవశేషాలు కాల్చకుండా కలియ దున్నడంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ అన్నారు. చిగురుమామిడి0 మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో సర్పంచ్ బోయిని రమేష్ అధ్యక్షతన రైతులకు, ఈజీఎస్ మహిళా రైతు కూలీలకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పంట అవశేషాలు కాల్చకుండా మల్చల్ శ్రేడర్లతో వాటిని భూమిలో కలిపి వేస్ట్ డికంపోజర్ సింగిల్ సూపర్ ఫాస్ట్ చల్లుకొని భూమిలో కుళ్లింపజేసి నేల సారాన్ని పెంచుకోవాలన్నారు. పశువులకు మేతగా వినియోగించడం, సేంద్రియ ఎరువుల తయారీలో ఉపయోగించుకోవాలని సూచించారు.
వరి మిగులు అవశేషాలను కాల్చడం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు గాలిలో కాలుష్యం పెరగడం పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు నశించి భవిష్యత్తులో పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి కొయ్యలు తగలబెట్టడంతో భూమి భౌతిక స్థితి దెబ్బతింటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రణయ్, పంచాయతీ కార్యదర్శి అరుణ్, నిగరణ సమితి సభ్యులు జక్కుల బాబు, చీల లక్ష్మారెడ్డి, పశ్చిమట్ల జగన్, డోకి నరేష్, మధుసూదన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కుద్బుద్దీన్, రైతులు పాల్గొన్నారు.