పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి.. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలి
సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మనం కోరుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా బలహీనవర్గాల కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు.
- కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తున్నడు
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
రాయికల్, ఆగస్టు 18 : సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మనం కోరుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా బలహీనవర్గాల కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా అందించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభిస్తే.. రేవంత్ రెడ్డి వాటిని కనుమరుగు చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎకడాలేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తే.. ఇప్పుడు కొత్త పింఛన్లు రావడం లేదని వాపోయారు. మంగళవారం రాయికల్ మండలం అల్లీపూర్లో సర్వా యి పాపన్న విగ్రహాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న, గోలొండ కోటపై జెండా ఎగురవేయడం అంటే ఎవరూ ఊహించలేదని కొనియాడారు. ఆనాడు బహుజన సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పాపన్న చేసిన పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయిస్తే 51శాతం బహుజన్లు ఉన్నారని, అదే రేవంత్రెడ్డి సర్వే చేయిస్తే బీసీల శాతం ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఎకడైనా జనాభా పెరుగుతుందా.. తగ్గుతుందా? అనేది రేవంత్ రెడ్డికే తెలియాలన్నారు. గౌడ కులస్తులకు చెట్లు పెంచడానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని జీవో ఉందని, ప్రభుత్వమేమో భూమి ఎకడికెళ్లి ఇవ్వాలని అంటుందని మండిపడ్డారు. ఒకవేళ భూమి లేకపోతే భూ కొనుగోలు పథకం ద్వారా భూమి కొని అందులో చెట్లు పెట్టి ఇవ్వాలని సూచించారు. ఎందరో గీత కార్మికులు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ప్రమాద బీమా డబ్బులు బాధితులకు అందడం లేదని వాపోయారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

