హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి రేవంత్ సర్కార్‌కు ముచ్చెమటలు పడుతున్నాయ ని, అందుకే పాశవిక చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటుచేసిన విగ్రహాన్ని నోటీసుల్లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేయడం ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. శవ రాజకీయాలు, విగ్రహాల కూల్చివేతలతో రాష్ట్ర రాజకీయాలను కాంగ్రె స్ పూర్తిగా కలుషితం చేస్తున్నదని మండిపడ్డారు.
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన గొప్ప నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అని నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ఉద్య మ నాయకుడి విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన నర్సంపేట ప్రజల గుండెల్లో ఉన్న ఆయన జ్ఞాపకాలు, స్థానాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం చెరిపేయలేదని స్పష్టం చేశారు. ప్ర జాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని, పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని, బీఆర్ఎస్ శ్రేణులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.