KARIMNAGAR RTC | కరీంనగర్, తెలంగాణచౌక్, ఏప్రిల్ 9 : ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపో మేనేజర్లతో ఆర్ఎం రాజు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల సమావేశం మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతీ డిపో ఆదాయ వ్యయాలను, మెకానిక్ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
రానున్న వేసవి కాలము దృష్ట్యా బస్టాండ్లలో మంచినీటి వసతి రద్దీకి అనుకూలంగా బస్సులు నడిపించాలని ఆదేశించారు. డిపో పరిధిలోని బస్టాండులను డీఎంలు పర్యవేక్షించాలని సూచించారు.