Inspection | కోరుట్ల, జనవరి 5 : కోరుట్ల పట్టణంలోని హజీపురా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సోమవారం జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. పరిసరాల శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం, ప్రధానోపాధ్యాయులు నిషత్ అంజూమ్, ఉదయరూప, గంగాధర్, సీఆర్పీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.