procurement centers | సారంగాపూర్ : మండలంలోని కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి, రెచపల్లి, లచ్చనయక్ తండా, బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు నాణ్యతమైన ధాన్యాన్ని ప్యాడి సెంటర్ కు తీసుకురావాలనీ ప్యాడి సెంటర్లలో ప్యాడి క్లీనర్ తప్పకుండా ఉండేలా తప్పతాలు లేకుండా శుభ్రం చేయాల సూచించారు.
మ్యాచర్ వచ్చిన వెంటనే కాంట తూకం వేయించి రైస్ మిల్లర్లకు పంపాలని, ట్యాబ్ డాటా ఎంట్రీ రికార్డులు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సెంటర్లో గన్నీ బ్యాగ్స్, టార్ఫాలిన్ కవర్స్, కవర్స్ అందుబాటులో ఉండేలా చూడాలని, తాలు లేకుండా చూడాలని ఎండలు ఎక్కువ ఉన్నందున పొద్దున సాయంత్రం పని చేయించాలని సూచించారు. ఆయా సెంటర్లో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఐకేసీ అధికారులు, సెంటర్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.