Indurthi | చిగురుమామిడి, మే 3 : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్-ప్రణీత దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని గౌడ సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, జర్నలిస్ట్ గుడికందుల దాసు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, గౌడ సంఘ నాయకులు గట్టు రమేష్, బుర్ర స్వామి, ఆకుల శ్రీనివాస్, గట్టు మొగిలి, బుర్ర పరశురాములు, బత్తిని శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుమంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.