తెలంగాణభవన్‌లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశమ య్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయనను పలువురు జిల్లా నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.