jagityal | జగిత్యాల టౌన్, జూన్ 27: జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వంట సరుకుల నాణ్యతను, విద్యార్థులు భోజనం చేసే హాలును పరిశీలించి వంట చేసే నిర్వాహకులకు తగు సూచనలు ఇచ్చారు.
నాణ్యతలేని సరుకులను వంటకు ఉపయోగించొద్దని నూతన మెనూ ప్రకారమే భోజనం నిర్వహిస్తున్నారా లేదా అని విద్యార్థులను వంట చేసే నిర్వాహకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో విద్యార్థులతో భోజనం చేసి నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా హాస్టల్ గదులు చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలు కోఆర్డినేటర్ మహేష్ పాల్గొన్నారు.