Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 13 : రామగుండం నగరాన్ని పరిశుభ్రం, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఆమోఘమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్, ఔట్ సోర్స్ కార్మికులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కార్యాలయంలో ప్రారంభించారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి తమ పాలక వర్గం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నుండి వారికి అందవల్సిన ప్రయోజనాలను సకాలంలో వచ్చేట్టు చూస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఒక్కొకరికి రెండు జతల దుస్తులు, రెండు తువ్వాలలు సుమారు 400 మంది సిబ్బందికి అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్ , జూనియర్ అసిస్టెంట్ చంద్రా రెడ్డి, పారిశుధ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.