Anganwadi | జగిత్యాల, మే 14 : అంగన్వాడీ స్కూల్లకు వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బుధవారం టెక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్-1 సూపర్ వైజర్ కవితారాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహనా కల్పించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ స్కూల్లకు ఈసారీ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన దృష్ట్యా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు,ప్రీ స్కూల్ పిల్లలకు సూపర్ వైజర్ కవితరాణి బియ్యం, పప్పులు, గ్రుడ్లు,నూనె, బాలామృతం, పాలు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు టీచర్ అరుణ, బాలింతలు, గర్భిణీలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.