Kishanraopet | వెల్గటూర్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్మూల గంగన్న మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అవసరాలను గుర్తించి 80 మంది విద్యార్థులకు శూలు అందజేయడం అభినందనీయమని అన్నారు.
పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులుగా అందరూ పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి సునీత, ఉప సర్పంచ్ అలుగునూర్ సతీష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తరాల సత్యవతి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.