Distribution of plates | సుల్తానాబాద్ రూరల్ ఆగస్టు 1: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజపల్లి గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు దీకొండ భూమేష్ కుమార్ కుమారుడు డాక్టర్ అఖిల్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రామంలోని 60 మంది ప్రభుత్వ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ప్లేట్లు శుక్రవారం భూమేష్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా భూమేష్ కుమార్ మాట్లాడుతూ.. పుట్టినరోజు, పెళ్లిరోజులు కార్యక్రమాలను స్కూల్ పిల్లల వద్ద జరుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ క్లబ్ అధ్యక్షుడు జూపల్లి తిరుమల్ రావు, జిల్లా కో ఆర్డినేటర్ వలస నిలయ, క్లబ్ ప్రతినిధులు పిట్టల వెంకటేశం, ఆడెపు పాండురంగ, కన్న రమేష్, మాజీ సర్పంచ్ గుజ్జేటి దేవేంద్ర వెంకన్న, దాసరి రమణారెడ్డి, దాసరి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.