Lions Club | సుల్తానాబాద్ రూరల్, జూలై 18: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్ వలస నీలయ్య సహకారంతో రూ.ఐదు వేల విలువగల నోటు బుక్కులను అధ్యాపక బృందం సమక్షంలో విద్యార్థులకు అందించారు.
అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నంత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు నోటుపుస్తకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. లైన్స్ క్లబ్ వారు చేసే పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జూపల్లి తిరుమల్ రావు, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా హంగర్ రిలీఫ్ కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ ఉపాధ్యక్షుడు పూసాల సాంబమూర్తి, కార్యదర్శి ఎరబెల్లి సుధీర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యాపకులు సతీష్, స్వర్ణలత, సారయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.