పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శ
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- రామడుగులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
రామడుగు, డిసెంబర్ 28: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన మండలంలోని 25 మంది లబ్ధిదారులకు రూ. 25 లక్షల 29 వేల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులవి ఊకదంపుడు మాటలేనని, చేతల్లో చూపించే సత్తా లేదన్నారు. బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. అతి తక్కువ సమయంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, శనిగరపు అనిల్‌కుమార్, గడ్డం మోహన్‌రావు, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు వంచ మహేందర్‌రెడ్డి, మడ్డి శ్యాంసుందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నర్సింబాబు, ఆరపెల్లి ప్రశాంత్, నాగుల రాజశేఖర్‌గౌడ్, శనిగరపు అర్జున్, లంక మల్లేశం, మాదం రమేశ్, కనుకం కనకయ్య, పూడూరి మల్లేశం, మొయిజ్, బీరెల్లి అనిల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

