ఆడబిడ్డలకు అండగా సర్కారు
డబిడ్డల పెండ్లికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికం సాయం అందజేసి అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- గంగాధర మండలం గర్శకుర్తిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గంగాధర, జనవరి 21: ఆడబిడ్డల పెండ్లికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికం సాయం అందజేసి అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గర్శకుర్తి గ్రామంలో శనివారం ఆయన ఏడుగురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు, చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బాల్య వివాహాలు తగ్గినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 10 వేల కోట్ల ఆర్థిక సాయం అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే, గర్శకుర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రేణికుంట తిరుపతి తల్లి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనకు హాజరయ్యారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యసనా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ కార్యక్రమాల్లో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, సర్పంచులు అలువాల నాగలక్ష్మి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, ముక్కెర మల్లేశం, దోర్నాల హన్మంతరెడ్డి, ఎంపీటీసీలు తడిగొప్పుల రజిత, అట్ల రాజిరెడ్డి, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, కల్వకోట శ్రీనివాసరావు, మామిడిపెల్లి అఖిల్, రామిడి సురేందర్, వేముల అంజి, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన సామల భిక్షపతికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.39 వేల ఆర్థిక సాయం మంజూరైంది. గంగాధర మండలం బూరుగుపల్లిలో శనివారం ఆయన లబ్ధిదారుకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందని ద్రాక్షలా ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానలో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

