గంగాధర, మార్చి 20: మండలంలోని మధురానగర్ గ్రామ తాపీ మేస్త్రి, సెంట్రింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం 10వ తరగతి(10th class students)విద్యార్థులు 100 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ సంఘంలోని ప్రతి సభ్యుడు ఏడాదికి ఒక అరటి పండ్ల గెలను విద్యార్థుల కోసం అందజేయాలని తీర్మానించారు.
పండ్లు పంపిణీ చేసిన సంఘం సభ్యులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బక్కశెట్టి గంగయ్య, ప్రధాన కార్యదర్శిగా గుంజి మల్లికార్జునరావు, కోశాధికారిగా బాలలక్ష్మయ్య, సభ్యులు గురవయ్య, ద్యావ ఎల్లయ్య, ద్యావ మల్లయ్య, కిష్టయ్య, మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.