రామగిరి ఫిబ్రవరి 10 : లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరికాలని(Lions Club) ఆధ్వర్యంలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం క్లబ్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి సహకారంతో పరీక్ష సామగ్రి(Exam materials), కెరీర్ గైడెన్స్ సంబంధించిన వివరాలతో కూడిన చాట్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ మొలుమురి శ్రీనివాస్, గంట వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం అన్నారు. పాఠాలను కేవలం చదవడం కాకుండా దాని సారాంశాన్ని అర్థం చేసుకుంటే పరీక్షలు రాయడం సులువుగా ఉంటుందని తెలిపారు.
జీవితంలో పరీక్ష ఫలితాలు వాటి ర్యాంక్‌లు ముఖ్యం కాదు.
విద్యార్థులు తము తీసుకునే నిర్ణయాలే జీవితాన్ని నిర్ణయిస్తాయన్నారు. కలంతో మీ కలలను సహకారం చేసుకొని పరీక్షల్లో పది పాయింట్లు సాధించిన వారికి లయన్స్ క్లబ్ తరఫున నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని తెలిపారు. అనంతరం క్లబ్ డైరెక్టర్, ప్రకృతి వైద్య, యోగా నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ మాట్లాడుతూ పరీక్ష సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దన్నారు. దీనికి పిల్లల తల్లిదండ్రులు సహకారం ఎంతో ముఖ్యమని, నైపుణ్యం పెంచుకొని, ఉపాధ్యాయుల సహకారం తీసుకొని మంచి ప్రణాళికతో ముందుకు సాగుతూ ప్రతిభ కనబరిస్తే విజయం మీ సొంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, తీగల శ్రీధర్, పాఠశాల హెడ్ మాస్టర్ శోభన్ రావు, సిబ్బంది సత్యమూర్తి, సత్యనారాయణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.