SRR College | కమాన్చౌరస్తా, మార్చి 9 : ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగ అధ్యక్షుడు రాజయ్య అధ్యక్షతన అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఆర్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సౌజన్యంతో కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ అందుల పాఠశాల విద్యార్థులకు మిఠాయిలను పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన మెటీరియల్ పంపిణీ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ బధిరుల పాఠశాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వీటిని పంపిణీ చేయడానికి అవసరమైన మొత్తాన్ని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అధ్యాపకులు సమకూర్చి తమ ఉదారతను చాటుకున్నారని కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎం మల్లారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పీ నితిన్, టీ రాజయ్య, ప్రభుత్వ అంధ పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్, బదిరుల పాఠశాల ప్రిన్సిపాల్ తులసిరామ్, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎం మల్లారెడ్డి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ హర్ జ్యోత్ కౌర్, అధ్యాపకులు డాక్టర్ ఆర్ రామకృష్ణ, డాక్టర్ బీ నరేష్, డాక్టర్ అర్జున్, ఎం శిరీష, అరవింద్, నర్మద, వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు.