హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు. శనివారం రాత్రి సుజాతనగర్ మండలంలోని సుమారు 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఆదివారం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 నుంచి సూపర్వైజర్లు (ఓవర్మెన్లు)ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు. – కొత్తగూడెం టౌన్/కొత్తగూడెం సింగరేణి