Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 30 : చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శశిధర్ శర్మ గత సంవత్సరం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాలను డీఐఈవోకు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య 100కు చేరినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో ఉత్తమ ఫలితాలను తీసుకువచ్చిన ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపక బృందమును డీఐఈవో అభినందించారు.