RTC parking | పెద్దపల్లి, మే 22(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టి జి ఎస్ ఆర్టీసీ టూ వీలర్ పార్కింగ్ లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెరువును తలపిస్తున్నది. పార్కింగ్లోని వాహనాలన్నీ జలమయం అవుతున్నాయి. పార్కింగ్ స్థలం లోతుగా ఉండటంతో బస్టాండ్ ప్రాంగణంలోని దుర్గంధం అంతా పార్కింగ్ స్థలంలోకి వచ్చి చేరుతున్నది. దీంతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతిరోజు డబ్బులు చెల్లించి తమ వాహనాలను పార్కింగ్ చేస్తుంటే.. వర్షం కురిస్తే చాలు మీరంతా పార్కింగ్ స్థలంలోకి చేరి తమ వాహనాలు నీటిలో తడుస్తూ తుప్పు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టి వర్కింగ్ స్థలంలోకి దుర్గందం రాకుండా.. మురికి నీరు చేరకుండా.. ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.