Medical Officer | రామగిరి, జూన్ 16: డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్నర్స్ మంగళవారం ప్రారంభించారు. స్టాప్ డయేరియా లో భాగంగా 0 to 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారికి ఇంటికి ఒకటి చొప్పున ors పాకెట్స్ ఆశ, ఏఎన్ఎం ల ద్వారా అందజేశారు.
ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు నీళ్ళ విరేచనాలు ప్రారంభమైతే వెంటనే ఓర్ఎస్ తాగించాలని సూచించారు. అలాగే దగర లోఉన్న ఆరోగ్య కేంద్రంకు వెంటనే తీసుకువెళ్ళాలని సూచించారు. ఇలా చేయటం వల్ల పిల్లల్లో డీహైడ్రేషన్ బారినుంచి పిల్లలను కాపాడుకోగలమన్నారు. సరైన సమయం లో చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం ను సందర్శించడం ఉత్తమమని, పాలిచ్చే తల్లుల పిల్లలు వాంతులు, విరేచనాలు అయినప్పుడు పాలను యథావిధిగా తల్లి పాలను పట్టించవచ్చన్నారు.
అలాగే పరి శుభ్రత చర్యలు పాటించాలని, ఇంట్లో ని ఆహార పదార్థాల పై మూతలు ఉంచి ఆహారం కలుషితం కాకుండా చూడాలని భోజనం ముందు చేతులు శుభ్రం గా కడుక్కోవాలని, నీటిని కాచి చల్లార్చి వడకట్టి తాగాలని సూచించారు. జూన్ 16 నుంచి జులై 31 వరకు స్థాప్ డయేరియాపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందిని మండల వైద్యాధికారి ప్రదీప్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సీహెచ్వో భరత్ కుమార్, ల్యాబ్ టెక్నీషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.