Appointed | ధర్మారం, అక్టోబర్ 10: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఒకేషనల్ పి ఈ టి మేకల సంజీవ్ కరీంనగర్ జిల్లా ఎస్ జి ఎఫ్ -19 బాలికల ఫుట్ బాల్ కోచ్ గా నియమితులయ్యారు.
ఈనెల 12వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం సంగారెడ్డి లో నిర్వహించే 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -19 ఫుట్ బాల్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున బాలికల టీమ్ కోచ్ గా సంజీవ్ వ్యవహరిస్తారని కరీంనగర్ జిల్లా SGF ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ వేణు గోపాల్ తెలిపారు. కోచ్ గా ఎంపికైన సంజీవ్ ను ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపి కోచ్ గా వ్యవహరిస్తున్న ఆ జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.