జిల్ జిగేల్
నాలుగు వరుసల బీటీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ధర్మారం మండలం నూతన శోభను సంతరించుకున్నది.
- సెంట్రల్ లైటింగ్తో ధర్మారానికి కొత్త శోభ
- పూర్తయిన నాలుగు వరుసల బీటీ రోడ్డు
నాలుగు వరుసల బీటీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ధర్మారం మండలం నూతన శోభను సంతరించుకున్నది. మండల కేంద్రంలో పెద్దపల్లి-ధర్మారం ఆర్అండ్బీ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో డీఎంఎఫ్టీ పథకం ద్వారా రూ.7కోట్లు మంజూరు కాగా, పనులన్నీ పూర్తికావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతేడాది అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రూ.50లక్షలతో నాలుగు వరుసల విస్తరణతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, డివైడర్ నిర్మించారు.

అనంతరం కోటి రూపాయలతో మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ఏఎంసీ ప్రధాన గేట్ వరకు, రూ.2కోట్లతో ఏఎంసీ కార్యాలయం గేట్ నుంచి ఎస్సారెస్సీ డీ-83 కాలువ వరకు బీటీ రోడ్డును విస్తరించారు. రూ.3.50కోట్లతో అంబేద్కర్ చౌరస్తా నుంచి వడ్డెర కాలనీ వరకు రెండు వైపులా డ్రైనేజీ, బీటీ రోడ్డు, డివైడర్, అలాగే అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు డివైడర్ నిర్మించారు. ఇటీవల డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మండల కేంద్రం జిల్ జిగేల్మంటూ కళకళలాడుతున్నది.
– ధర్మారం, డిసెంబర్13
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

