Devunipalli Jathara | పెద్దపల్లి రూరల్, నవంబర్ 13 : పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహస్వామి దేవాలయ జాతర ఆదాయం ఈ నెల 2నుంచి 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా రథోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పద్దుల కింద రూ.16,07,215 లు సమకూరినట్లు ఈవో శంకరయ్య పేర్కొన్నారు. సేవా టికెట్ ల ద్వారా రూ.2,55,065, తైబజార్ ద్వారా రూ.68,400, వివిధ రకాల వేలం పాటల ద్వారా రూ.6,01,000, హుండీల ద్వారా రూ.6,82,753రతో మొత్తం రూ.16,07,215లు సమకూరాయన్నారు.
అలాగే నగల రూపంలో 3గ్రా.ల మిశ్రమ బంగారం, 365 గ్రా.ల మిశ్రమ వెండి మొక్కుబడుల ముడుపుల రూపంలో వచ్చినట్లు ఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మాదాయ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో లెక్కింపు జరుగగా జాతర కమిటీ చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య, మాజీ ఉపసర్పంచ్ బొక్కల సంతోష్, పలువురు అధికారులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.