Neerukulla | సుల్తానాబాద్ రూరల్, జనవరి 28 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా బుధవారం జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజార్లు సారలమ్మను సంబురంగా తీసుకువచ్చారు. గద్దెపై చేరుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఈవో శంకరయ్య, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, ఆర్ఐ వినోద్, కార్యదర్శి సునీత, ఉప సర్పంచ్ దాసరి సతీష్, జాతర కమిటీ సభ్యులు రాజయ్య, శ్రీనివాస్, కోమల, ప్రశాంత్, కళావతి, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, జీపీవో శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. అలాగే మండలంలోని గర్రెపల్లి , నారాయణపూర్, తొగర్రాయి, గ్రామంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా మొదటి రోజు సారలమ్మ రాకతో భక్తులు పూజలు చేశారు.