Odela | ఓదెల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. విద్యాసంస్థలకు ఆదివారంతో సెలవులు ముగియనుండడం, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న క్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Odela | ఓదెల, జూన్ 14 : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. విద్యాసంస్థలకు ఆదివారంతో సెలవులు ముగియనుండడం, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న క్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ దూర ప్రాంతాల నుంచి భక్తులు రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఆదివారం తెల్లవారుజాము వరకే వచ్చి చేరుకున్నారు.
దీంతో ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూలైన్లో భారీగా భక్తులు నిలబడి ఉన్నారు. ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సరిపడా వసతి గదులు, చెట్లు లేక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మహిళలు, పిల్లలు, వృద్దులు భక్తుల రద్దీతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్నాలు, బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరేలా చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి క్యూలైన్లో పంపించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

