Manthani | మంథని, ఆగస్టు 8: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆలయ అర్చకులు స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పామాలికలతో సర్వాంగసుంధరంగా ఆలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
మంథని ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడంతో మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా ఒడి బియ్యం, పసుపు, కుంకుమలను, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.