Manasa Devi temple | గన్నేరువరం, ఆగస్ట్22: మండలంలోని ఖాసీంపేట శ్రీ మానస దేవి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆర్టీసీ బస్సులో భక్తులు తరలి రావడంతో ఆలయం ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
అమ్మవారిని సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ చంద్రారెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ చర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి 108 నైవేద్యాలతో మహా నివేదన దశవిధ హారతులు, ప్రత్యేక కుష్మాండ హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు.