గొల్లపల్లి, జూలై 1: సంక్షేమం. అభివృద్ధి తెలంగాణ సర్కారుకు రెండు కండ్లలాంటివని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రతిపల్లెలో సకల సౌకర్యాలు కల్పిం చి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. శనివారం గొల్లపల్లి మండలం గోవిందుపల్లి, గుంజపడుగులో పర్యటించారు. రూ. 1.60 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైనేజీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ గ్రామాల్లో తా గునీరు, విద్యుదీకరణ, డ్రైనేజీలు, అంతర్గత రో డ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సఫాయిలకు జీతాలు ఇవ్వలేక సర్పంచులు తప్పించుకు తి రిగే పరిస్థితులు ఉండేవన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా ఠంఛన్‌గా పల్లె ప్రగతి నిధులు ఇస్తుండడంతో గ్రామ సేవకులు, పారిశుధ్య కార్మికులకు నెలనెలా వేతనాలు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద పల్లె ప్రకృతి వనం, నర్సరీల ఏర్పా టు, డంప్‌యార్డులను నిర్మించామన్నారు.
ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్‌ను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ పల్లెవాసుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అంతకుముందు గుంజపడుగులో రూ.85 లక్షలతో నిర్మించిన మురుగు కాలువ, రూ.30 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే గోవిందుపల్లి లో రూ.45లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, రూ.30లక్షలతో నిర్మించిన మురుగు కాలువల ను ప్రారంభించారు. అలాగే రెడ్డి సంఘ భవనానికి రూ.5లక్షలు మంజూరు కాగా ప్రొసీడిం గ్ కాపీని అందజేశారు. సర్పంచులు సరిత రవి, శంకరవ్వ, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి రవి, జ డ్పీటీసీ జలంధర్, విండో చైర్మన్లు రాజ సుమన్ రావు, మాధవరావు, ఏఎంసీ చైర్మన్ హ న్మాం డ్లు, వైస్ చైర్మన్ లింగారెడ్డి, గొల్లపల్లి విండో వైస్ చైర్మన్ తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పాదం రమేశ్, నేతలు కిష న్, కమలాకర్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు.