మంథని, నవంబర్ 25: టీఆర్ఎస్ కోసం ప్రజలు సైనికుల్లా పని చేసేలా కార్యకర్తలు సిద్ధం చేయాలని.. ఇందుకోసం సర్కారు చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంథని పోచమ్మవాడ శివారులోని శ్రీమహాలక్ష్మి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి విస్తృత భేటీని శుక్రవారం జడ్పీ చైర్మన్, పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చందర్ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్‌ను మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని 288 బూత్ కమిటీలకు ఉత్సాహం కలిగిన నాయకులను సభ్యులుగా నియమించాలని పార్టీ మండలాధ్యక్షులకు సూ చించారు. సభ్యులు తమ బూత్ స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా సిద్ధంగా ఉండాలని, మంథనిలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కుట్రలు, కుతంత్రాల కాంగ్రెస్ : పుట్ట మధు
కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలతో గత ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యే పదవి లేకపోతే కాంగ్రెస్ నాయకుడిపైనే గంజాయి కేసు పెట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. తమపై వార్తలు రాశారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే త మ్ముడు విలేకరులను బెదిరించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. కుటుంబ పాలనతో ని యోజకవర్గంలో మౌలిక వసతులు లేక ఎంతో మంది యువకు లు నక్సలైట్లుగా మారారని, వారి అణచివేతకు పోలీసులు చేపట్టిన చర్యల్లో ఇటు పో లీసులు, అటు నక్సలైట్లలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రాణాలు కో ల్పోయారని గుర్తు చేశారు. వీరి చావులపై సీబీఐ ఎంక్వైరీ కోరాలి గాని, హంతకులు, చీటర్లపై సీబీ ఐ విచారణ కోరడం సిగ్గు చేటని మండిపడ్డారు.
మంథని గడ్డ.. పుట్ట మధన్న అడ్డా..
మంథని గడ్డ.. పుట్ట మధన్న అడ్డా అని.. రా బోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మధన్నే వి జయం సాధిస్తారని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించే ఏకైక నాయకుడు పుట్ట మధూకర్ అని నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, పార్టీ మండలాధ్యక్షులు కొండ శంక ర్, రాచకొండ లక్ష్మి, జక్కుల ముత్తయయ, తగ రం సుమలత, కొత్త శ్రీనివాస్, ఆరెపల్లి కుమార్, ఎగోలపు శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.