Koya Sriharsha | పెద్దపల్లి, నవంబర్15: పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలోఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్బీఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకవచ్చే ప్రక్రియ ఈనెల 22 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాల నిర్వహణ, పాఠశాలల అభివృద్ధి పనుల పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని వినియోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్బీఐ నుంచి వెనక్కి తీసుకునేందుకు కేవైసీ వివరాలు, రిక్వెస్ట్ లెటర్ అధికారులు అందించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక వసతుల పనులు పూర్తి చేసేందుకు కలెక్టరేట్ నుంచి దాదాపు రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేశామని, పనులు వచ్చేనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులు నిర్ణిత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు సంబంధిత జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.