జగిత్యాల టౌన్, ఏప్రిల్ 18: ఉపాధ్యాయులు తల్లిదండ్రులను చైతన్యం చేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం డీఈవో ఆఫీసులో వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు జడ్పీహెచ్ఎస్ వెల్గొండ, ఎంపీపీఎస్ వెల్గొండ పాఠశాల వారు ముద్రించిన వాల్పోస్టర్ను డీఈ వో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు అమర్నాథ్రెడ్డి, ఆనందరావు, జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీఏస్ హెడ్మాస్టర్ దశరథరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.