గోదావరిఖని, సెప్టెంబర్ 24 : రామగుండం కాంగ్రెస్ కలవరం మొదలైంది. పార్టీ టికెట్ ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ కేటాయించాలని ఐఎన్టీయూసీ వ ర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప ట్టణంలో జరిగిన ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశానికి సింగరేణి సంస్థలోని 11 డివిజన్ల నుంచి ఐఎన్టీయూసీ నాయకులు తరలివచ్చారు. ఈసారి ఐఎన్టీయూసీ కోటాలో రామగుండం నుంచి ఐఎన్టీయూసీ సీనియర్ నేత జనక్ టికెట్ కేటాయించాలని ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. లేదంటే సింగరేణి సంస్థ విస్తరిం చి ఉన్న 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఐఎన్టీయూసీ సహాయ నిరాకరణ చేస్తుందని తేల్చిచెప్పారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ సీనియర్ నాయకులు బాబర్ సలీంపాషా, ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆర్ చంద్రశేఖర్ పాల్గొన్న సమావేశంలో అందరి అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా పలు ముఖ్య నేతలు మాట్లాడుతూ, కార్మిక క్షేత్రమైన రామగుండంలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ టికెట్ ఐఎన్టీయూసీ నేత జనక్ కేటాయించాలని అన్నారు.
సింగరేణి కార్మికుల ఓట్ల ప్రభావం 12 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండింట 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్ ఐఎన్టీయూసీ ప్లీనరీ సమావేశంలో దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారని, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గతంలో రెండు పర్యాయాలు రామగుండం టికెట్ ఐఎన్టీయూసీకే కేటాయించేలా కృషి చేసారని గుర్తు చేశారు. ఈసారి రామగుండం టికెట్ మాత్రం ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడైన జనక్ కేటాయించాలన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, గుమ్మడి కుమారస్వామి, దర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య, జెట్టి శంకర్ పసునూటి రాజేందర్, కలవేన శ్యామ్, వడ్డేపల్లి దాస్, ఎట్టం క్రిష్ణలు, ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
అయోమయంలో మక్కాన్ వర్గం
ఇప్పటికే కాంగ్రెస్, ఐఎన్టీయూసీ రెండు గ్రూపులు గా ఉన్న రామగుండం రాజకీయం మరోసారి ర చ్చకెక్కింది. రామగుండం కాంగ్రెస్ టికెట్ తనకే ఖాయమని ప్రచారంలో దూసుకుపోతున్న మక్కాన్ రాజ్ ఆదివారం ఐఎన్టీయూసీ గట్టి షాక్ ఇవ్వడంతో వారు ఏం చేయాలో? పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ గ్రూపు లు ఉన్న మక్కాన్ మద్దతుగా ఉంటున్నా రు. ఐఎన్టీయూసీ నాయకులు మాత్రం చాలా కాలంగా జనక్ టికెట్ కావాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఇంతకాలం ఎవరికి టికెట్ ఇచ్చినా రానివారు సర్దుకుపోతారని భావిస్తే అందుకు భిన్నంగా రామగుండం టికెట్ ఐఎన్టీయూసీకి ఇవ్వని పక్షంలో కోల్ వ్యాప్తంగా తాము కాంగ్రెస్ సహాయ నిరాకరణ చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడంతో రామగుండం రాజకీయాలు ఎటుమలుపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కుమ్ములాటలతో క్యాడర్ అయోమయంలో పడుతోంది.