సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కలిసి, వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడారు. ఉపాధి హమీ కూలీలకు రోజువారీ వేతనం 400 ఇవ్వాలని, సంవత్సరంలో 150 పనిదినాలు కల్పించాలన్నారు.
ఎన్నికల ముందు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కేల్ వర్తింప జేయాలని కోరారు. గత జనవరి నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని, విధి నిర్వహనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10లక్షల ఎక్స్గ్రేషియా అందివ్వాలన్నా 4779 సర్కులర్ను రద్దు చేసి, లిస్టు 3 కింద తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు నేదూరి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి వెంకటేశ్, ప్రచార కార్యదర్శి పసుల శేఖర్, మున్నా, మహేందర్, రాజు ఉన్నారు.