ఇబ్రహీంపట్నం, జూన్ 8: మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీగా డిమాండ్ నెలకొన్నది. చేపల కోసం ప్రజలకు మార్కెట్లలో క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలను పడుతున్న మత్స్యకారులు.. రైతులు, గ్రామస్తులకు తక్కువ ధరకే విక్రయించారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రజలు.. చెరువు వద్దకు భారీగా చేరుకుని చేపలను కొనుగోలు చేశారు. తమ కళ్ల ముందే చేపలను పట్టి కిలో రూ.150 విక్రయించడంతో ప్రజలు బారులు తీరారు. రైతులకు విత్తనాలు వేసేందుకు మిరుగు మొట్టమొదటి పండుగగా భావిస్తూ మిరుగు రోజున ప్రతి కుటుంబంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది.