Deeksha Diwas | ధర్మారం, నవంబర్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో గురువారం ధర్మారం మండల కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదం తో కేసీఆర్ ఆమరణ దీక్షను ప్రారంభించిన రోజును ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో నవంబర్ 29 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించే దీక్షా దివాస్ ను నిర్వహిస్తున్న నేపథ్యంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పుస్కూరు రామారావు, కాంపల్లి చంద్రశేఖర్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.