Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 1 : ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సీట్ అధికారులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం బస్టాండ్ వద్ద చావు డప్పుతో ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్ట విరుద్ధంగా కుట్ర పన్నుతుందని వారన్నారు. బీఆర్ఎస్ పై ఎలాంటి కుట్రలు పన్నిన ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసర్ల హరీష్, మాజీ సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, నాయకులు దరిపల్లి సంపత్, వెంకటస్వామి, తోట శ్రీనివాస్, కొంకట కొమురయ్య, ముత్యాల కొమురయ్య, మ్యాదరవేణి ప్రవీణ్, రవి, కత్తుల ప్రశాంత్, వార్డు సభ్యులు మాచమల్ల రమేష్, తోట రజిత, కత్తుల లక్ష్మి, ఓర్సు కస్తూరి శ్రీనివాస్, తిరుమల, సమ్మయ్య, వెంకటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.