Keshanapalli | కేశనపల్లి కెనాల్ కాల్వలో మృతదేహం లభ్యం
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు.
Keshanapalli | ముత్తారం, సెప్టెంబర్ 4 : ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సాయిరాం మూడు రోజుల క్రితం ముత్తారం మండలంలోని హరిపురం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మంపల్లి గ్రామంలోని మరో బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు.
ఈ క్రమంలో కేశనపల్లి గ్రామ సమీపంలోని కెనాల్ కాల్వలో ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేశనపల్లి గ్రామ సమీపంలోని కెనాల్ కాల్వలో శుక్రవారం పొలం పనులకు వచ్చిన కూలీలకు దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సె రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

