Inspection | పెద్దపల్లి కమాన్, డిసెంబర్ 27: పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రాంరెడ్డి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.
డీజే సౌండ్ పెట్టకుండా, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంతత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని సూచించారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణరావు, రూరల్ ఎస్సై మల్లేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.